ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!

సంక్రాంతి పర్వదినం సంబరాలకి నిర్వచనం. సంతోషాల్ని కలబోసుకునే ఒక మధుర వైభవం!

తెల్లవారక ముందే భోగి మంటలు…

ముంగిళ్ళ లో చక్కని చుక్కల ముగ్గులు…

పొలాల్లో చేతికొచ్చిన పంటలు…

ఇంట్లో పసందైన కమ్మని వంటలు…

కొత్త బట్టలు.. గొబ్బి పాటలు …

కొక్కొరోకో కోడి పందెములు…

గంభీర గంగిరెద్దు విన్యాసములు..

పిల్లల చిలిపి అల్లరులు..

మేళ తారాళాలు…

కనుమ మినుములు..

హరిదాసు కీర్తనలు..

గాలి పటాల ఆటలు..

అవధుల్లేని ఆనందపు అనుభూతులు..

ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో మరి ఎన్నెన్నో..! మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి సిరుల క్రాంతి కావాలి అని కోరుకుంటూ…

–  మీ నేస్తం

ప్రకటనలు

10 Responses to ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!

  1. malapkumar అంటున్నారు:

    సంక్రాంతి శుభాకాంక్షలు .

  2. malapkumar అంటున్నారు:

    మీ బొమ్మ చాలా బాగుందండి . నేను గ్రీటింగ్ కార్డ్ లో వుపయోగించుకోవచ్చా ప్లీజ్ .

  3. nelabaludu అంటున్నారు:

    ఒహు.. విచ్చల విడిగా ఉపయోగించుకోండి :)

  4. చిన్ని ఆశ అంటున్నారు:

    అవన్నీ ఒకప్పటి ముంగిట్లో సరదా సందడులు…
    ఇప్పుడు టీవీ ల్లోనే అదరా బదరా భోగి మంటలు….
    బావుందండీ కవిత…
    సంక్రాంతి శుభాకాంక్షలు!

  5. సుజాత అంటున్నారు:

    బొమ్మ బాగుందండీ! ఇప్పటివరకూ ఈ సీజన్లో ముగ్గులేసే వాళ్ళనే తప్ప గొబ్బెమ్మలు పెట్టే అమ్మాయిని మీ బ్లాగులోనే చూస్తున్నా!

  6. nelabaludu అంటున్నారు:

    @ చిన్ని ఆశ ..
    అవునండి.. ఇప్పుడు అసలు విషయం తక్కువ హడావిడి ఎక్కువ…. :P
    @ సుజాత ..
    ధన్యవాదములు.. హ.. హ.. ఏరి కోరి ఊరి నుండి పిలిపించానండీ!..:)

  7. jaya అంటున్నారు:

    చాలా బాగుందండి. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

  8. gangadhara reddy అంటున్నారు:

    superga vundi

  9. ధన లక్ష్మి అంటున్నారు:

    సో నైస్ :) మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: