ఎద లో ఏదో మొదలయ్యింది..!

2012/03/31

నిను చూడగానే…
నన్ను నేను మరచి
తీయని కలల్లో మునిగి
మతి చెడి మాట మౌనమై
మనసు మూగబోయి
ఆలోచనలతో సతమతమై
నిను కలవాలనే ఆరాటం…!

నువ్వు కనపడగానే…
మనసు సూర్యోదయమై
పరువం పాట పాడి
వలపు తేజమై
గుండె నాట్యమాడి
తనువంతా ఆనందంతో కోలాటం…!!

నువ్వు చూడగానే…
మెరుపులా మెరిసి
గాలై ఎగిరిన ప్రాణం
చినుకులా కురిసి
దరి చేరిన ఈ క్షణం
శృతి మించిన దాహంతో
నీ వెచ్చని కౌగిలికై పోరాటం…!!!

ప్రకటనలు