మే పదహారు – ఎవరు ఖరారు?

ap-cm రాష్ట్ర రాజ్ కీయం – కౌన్ బనేగా ముఖ్యమంత్రి ?

నాకెందుకొ ఈ మధ్యన రాష్ట్ర రాజకీయం పై కాస్త పట్టొచ్చినట్లునపిస్తుంది.. కారణం మొదటి సారి ఓటు వేసినందుకొ లేక చిరంజీవి రాజకీయాంగ్రేటం చెసినందుకొ లేక లొక్ సత్తా పార్టీ మొదటగా బోణి చేస్తున్నందుకో గాని.. ఎక్కడ కెల్లిన ఇవే డిస్కషన్స్ నడుస్తున్నాయ్..  ఫ్రెండ్స్ తొ, కోలిగ్స్ తొ అనామకులతొ చిట్ చాట్ లొ, తెలియని వారితొ, తెలిసిన వారితొ, ఎవరు కలిసిన, మరెవరు కలవకపోయిన ఎవరు గెలుస్తారు అని తెగ ఇంట్రెస్టింగ్ గా మాట్లెడుసుకుంటున్నాం..

ఇండియా – పాకిస్తాన్ క్రికెట్  మ్యచ్ ఫైనల్ కి ఉన్నంత ఆసక్తి నెలకొంది.. ప్రజా తీర్పు వెలువడడానికి, కొత్త గవర్నమెంట్ ఏర్పరుచుకోవడానికి ఒకే రోజు మిగిలి ఉంది.. రేపే త్రిమూర్తుల జాతాకాలు తెలియబోతున్నాయ్..కేంద్రం లొ మరియు రాష్ట్రం లొ ఫలితాలు రేపటి మధ్యహ్నం లోపు తెలిసిపోతాయ్.. కేంద్రం ఫలితాలు అటుంచితె మన రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయొ మరి!

ఎవరికి వారు మేమంటె మేమే!  మాకిన్నొస్తాయ్..  గెలుపు తధ్యం అని లొట్టలేసుకుంటున్నారు..నాకున్న అవహగాన బట్టి ఆయా పార్టీ లకు సీట్లు ఈ విదంగా వస్తాయెమో అని అనుకుంటున్నాను.

మహాకూటమికి 100 -120
కాంగ్రెస్ కి 80 -100
ప్రజారాజ్యానికి 60 -80
మిగతావాటికి 30-60

అదేదొ సాంఖ్యక శాస్త్రం లొ పౌన:పున్యం పట్టిక కి కొలతలు సరిగాలేని తరగతి అంతరం తలక్రిందులయినట్లుంది కదూ!

కాంగ్రెస్ వెంటె ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకొస్తున్న దేవుడి పాలన కు మళ్ళీ పగ్గం కడుతారో… మాజిక్ ఫిగర్ 200 సీట్లు మావె అని నరకాసుర వధ తొ ఉన్న మనకు మే 16 న దీపావళి జరుపుకుందాం అంటూ తిరిగి అందలమెక్కాలనుకుంటున్న చంద్రబాబుకు సై అంటారొ,..   సేవే లక్ష్యం అని సంచలన మార్పు తొ శ్రీకారం చుట్టాలనుకుంటున్న సెన్సేషనల్ స్టార్ చిరంజీవి కి స్వాగతం పలుకుతారొ… తెలుసుకోవడానికి కుతూహలం గ ఉంది.. మీకెలా ఉంది? ఏ రాయ్ ఐతె ఏంటి తగలిచ్చుకోవడానికి అని అనుకుంటున్నారా..

మీ  కీలక సేవలు మరోసారి అవసరం:

submahan

అసలె ఏది జరిగిన హడావిడి గా ఉండె రాష్ట్రం లొ ఈ సారి ఎన్నికలు సాఫిగా… సరిగా జరిగాయంటె ముఖ్యంగా ఈ ఇద్దరె కారణం అని చెప్పొచ్చు.. ఒకరు సి.ఇ.ఒ. సుబ్బారావు గారు మరొకరు డి. జి. పి. మహంతి గారు. ఎన్నికలు

సజావుగ కండక్ట్ చేసి శభాష్ అనిపించుకున్న సుబ్బరావ్ ఫలితాలు ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్భందిగా చేసుకున్నట్లు పక్కా గా చెబుతున్నారు… నాకు తెలిసి ఇది కూడ విజయవంతగ పూర్తి చేస్తారని నమ్మకం..

ఇక మరో హీరొ మహంతి గారు.. ఎన్నికల సమయంలొ ఆలస్యంగ రంగంలొకి దిగినా ఆక్రమాలకు అడ్డు కట్టి తనంటె ఏమిటొ చేసి చూపించారు.. వీరిద్దరికి సమన్వయం, సహకారం సరిగ్గా కుదరడం వల్ల పోలింగ్ సరిగా జరిగిందని చెప్పొచ్చు..  మళ్ళీ ఈ కాంబినెషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి తగిన ఏర్పాట్లు, చర్యలు తీసుకొని విజయవంతం చెయడానికి కౄషి చేస్తున్నారు.. వెల్ డూయింగ్…లెట్స్ అప్రిషియేట్ దెం….!

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు…   ఓడిన వారు ప్రజా తీర్పు ని శిరసావహిస్తాం అనో..  గెలిచిన వారు ప్రజల మా పై ఉంచిన విశ్వాసానికి  కట్టుబడి ఉంటాం అనో మార్కులు వేసుకుంటుంటారు..

మే పదహారు.. శని వారం .. శని ఎవరికి తగులునో…   మరి ఇంతవరకి  పట్టినావరిని శని వదిలిపోవునో…. ఎవరొచ్చినా.. మన రాష్ట్రానికి పట్టిన శని అలాగే ఉండునొ… వేచి చూద్దాం మరీ.. అంత కంటే ఏమి చేయగలం..!!!

—————————————————————————————

7 Responses to మే పదహారు – ఎవరు ఖరారు?

  1. శ్రీ అంటున్నారు:

    ప్రజా రాజ్యానికి 60-80 చాలా ఎక్కువ అనిపిస్తుంది. 40 దాటితే ప్రజారాజ్యం సఫలమయినట్టే నా దృష్టిలో.

  2. sagar అంటున్నారు:

    మీ estimation media exit polls కు ముందుగా publish చెస్తె బాగుండెది.

  3. a2zdreams అంటున్నారు:

    మీ అంచనా రిజనబుల్ గానే వుంది.ఇంకా మయా కూటమి ని నమ్ముతున్నారా ? ప్లీజ్ సెపరేట్ తెలుగుదేశం అండ్ టి.ఆర్.యస్.

  4. nelabaludu అంటున్నారు:

    @ శ్రీ ….
    ఉ. గొ. జిల్లాలొ స్ట్రాంగ్ గా ఉందని నా అభిప్రాయం…. మిగతావి … వెరసి.. 60+ అనుకుంటున్నా.. లెట్స్ సీ…!

    @ సాగర్…
    ఎప్పటినుండొ పోస్ట్ చేద్దామనుకున్నాను.. నా లోని బద్దకిష్టుడు లేట్ చేసేసాడు… :-)

    @ a2zdreams
    అంతేనంటారా… :-)

  5. panipuri123 అంటున్నారు:

    >నాకున్న అవహగాన బట్టి ఆయా పార్టీ లకు సీట్లు ఈ విదంగా వస్తాయెమో అని అనుకుంటున్నాను
    let’s see…

  6. Suman అంటున్నారు:

    Anna nee EXIT POLLS bokka borla paddayi….

  7. nelabaludu అంటున్నారు:

    @ SUMAN ..
    కదా… :-( :-(

వ్యాఖ్యానించండి