మనష్యుల్లొ రకాలు – మీరు ఏ రకమో తెలుసుకోండి :)

మనష్యుల్లొ రకాలేంటి?  తింగరి ప్రశ్న అనుకుంటున్నారు కదూ.. మనం ఎవరితోనైనా ఏదైనా చర్చిస్తున్నప్పుడు మూడొ వ్యక్తి ప్రస్తావన వస్తె సందర్భానుసారంగ… వాడా, వాడికి మెదడు అరికాళ్ళో ఉంటుంది.. వాడితొ పెట్టుకుంటె కంప చెట్లొ కాలు పెట్టడమె, వాడు నోరు తెరిస్తే డ్రైనేజే ;) ఇలా ఏదో ఒకటి..అనుకుంటూ ఉంటాం. అది మనకు వాడి తొ కలిసి ఉండటం వల్ల అవగాహనతోనో లేదా వాడి తొ చేసిన పనుల వల్లో, వాడిని స్టడి చేయడం వలనో మనకు బాగా తెలిసొస్తుంది..

ఇంతకి నేను చెప్పొచ్చేది ఏమిటంటె, కాలేజ్ కెళ్తున్న రోజుల్లొ మా ఇంగ్లీషు మాస్టారు ఒక రోజు క్లాస్ లొ మీరు నిన్న రాసిన అసైన్ మెంట్ టెస్ట్ మార్కులు తెలుసుకోండి అంటూ.. అందరికి పేపర్స్ ఇచ్చిన తర్వాత మా మొహాల్లొ ఎక్స్ ప్రెషన్స్ చూసి “అరె మీకు మనుష్యుల్లొ రకాలు తెలుసండర్రా?” అని అడిగి మేమిచ్చె డిఫాల్ట్ ఆన్సర్ త్వరితం గా తెలుసుకొని తను చెప్పడం ప్రారంభించాడు.

మొదటి రకం – కర్పూరం:

ఈ రకం మనుష్యులకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది.. ఏది చెప్పిన ఇట్లే గుర్తుండి పోతుంది.  ఆచరణలొ పెడతారు,  కర్పూరం లాంటి స్వభావం కలవారు. ఒక సారి వెలిగిస్తే చాలు, మిగతావాటిని వెలిగిస్తూ.. చుట్టు అంతా అంటుకుపోతుంది..

రెండవ రకం – బొగ్గు:

ఈ రకం మనుష్యులకి ప్రతీది గుచ్చి గుచ్చి చెబుతూ ఉండాలి, దేన్నైనా గుర్తు చేస్తూ ఉండాలి. చెప్పింది రెండు రోజులు పాటిస్తారొ లేదో మళ్ళి మూడొ రొజొచ్చేసరికి కథ మొదటికొస్తుంది.. బొగ్గు లాంటి వారు. ఉదాహారణకు ఇస్త్రీ చేసే ముందు బొగ్గును బాగా ఊది వేడెక్కిస్తాం, పది నిమిషాలవ్వగానే చల్లబడిపోతుంది, మళ్ళి ఉపయొగించడానికి ఊదుతూనే ఉండాలి..

మూడవ రకం – తడి బొగ్గు:

ఈ రకం మనష్యులకి ఎంత చెప్పినా చెవిటొడి ముందు శంఖం ఊదినట్లే, నువ్వెంతా చెప్పిన వినే రకం కాదు, తడి బొగ్గు లాంటివారు, మీరు తడిబొగ్గు ని మంటిచడానికి దాని పై కిరోసిన్ పోసినా, పెట్రొల్ పోసి మంటించినా అది కాలదు. కాలదు సరి కాదా దానికి పడే శ్రమ వ్రుధా అవుతుంది… పెట్రొల్ బొక్కా.. ;)

ఈపాటికి మీరే రకమో మీకు అర్దం అయిపోయిఉంటుంది అని అంటుండగా వెనుక బెంచి నుండి  “సర్! మరి మీరు ఏ రకం?” అనే సౌండ్… ;)

6 Responses to మనష్యుల్లొ రకాలు – మీరు ఏ రకమో తెలుసుకోండి :)

  1. Sarath 'Kaalam' అంటున్నారు:

    నేనయితే కర్పూరమే. గ్రాస్పింగ్ పవర్ కాదుగానీ నాకేదన్నా అంటుకుంటే పక్కోళ్ళందరికీ అంటించాలని తెగ ఇదయిపోతుంటాను.

  2. nelabaludu అంటున్నారు:

    @ శరత్
    నిజం చెప్పారు సుమ!

  3. sravan అంటున్నారు:

    nenu boggu rakam

  4. manosri అంటున్నారు:

    శరత్ గారు మీరు పొరబడ్డారు. కర్పూరం తాను ఒడిఒడిగా అంటుకుంటుంది కాని దేన్నీ తగల పెట్టదు

  5. balu అంటున్నారు:

    sir!
    ఇంకా కొంచం ఆలోచించండి మనుసులు ౩ రాకలేన ఇంకా ఎక్కువ రకాలుగా ఉంటారో
    ఎందుకంటే ఆ మూడు రకాలలో నేను ఏరకము కాదు. అంటే ఇంకా వేరే రకం ఉండాలి కదా ?

  6. nelabaludu అంటున్నారు:

    @ Balu..
    ప్రతి ఒకరు ఆ మూడు రకాల్లొ ఏదో వర్గానికి చెందినవారుంటారని నా అభిప్రాయం. ఇంతకి మీరే రకం కాదంటున్నారు.. మీ గూర్చి చెప్పండి.. ఎలాంటి వారో.. ;)

Leave a reply to manosri స్పందనను రద్దుచేయి